కావలసిన పధార్థాలు :   కాలి ఫ్లవర్ : రెండు జీలకర్ర పొడి: ఒకటిన్నర టీ స్పూన్లు ధనియాలపొడి: 2టీ స్పూన్లు టమోటాలు: పావు కేజీ అల్లంవెల్లుల్లి:  2టీ స్పూన్లు  ఎండుమెంతికూరపొడి : ఒక టీ స్పూన్ కారం: ఒకటిన్న టీ స్పూన్లు నెయ్యి- 50 గ్రా ఉప్పు: తగినంత కొత్తి మీర: 1కట్ట తయారీ చేసేవిధానం :   కాలి ఫ్లవర్ ను ముక్కలు గా తుంచి నీటిలో వేసి ఉప్పు కలిపి మెత్త బడే వరకు ఉడికించండి. స్టవ్ మీద పెనం ఉంచి -దాని అంచున ఉడికించిన కాలి ఫ్లవర్ ముక్కలు,టమోటా ముక్కలు అమర్చండి .  పెనం మద్య లో నెయ్యి వేసి సన్నని మంట మీద వేడి చేయండి.కొన్ని నిమిషాల తరువాత కాలి ఫ్లవర్ ముక్కల్ని మద్య లోకి తీసుకువచ్చి ఫ్రై చేయండి.తరువాత టమోటా ముక్కలు,ధనియాల పొడి,గరం మసాల,జీలకర్ర పొడి,ఉప్పు వేసి-అట్ల కాద తో చిన్న చిన్న ముక్కలు గా కొడుతూ బాగా దగ్గరగా చేయండి. ఫ్రై చేసిన ముక్కలు దగ్గర అవ్వగానే ఎండు మెంతికూర పొడి,కొత్తి మీర జల్లితే గోబీ టకా టిన్ రెడీ...వేడి వేడి ఈ వంటకం స్నాక్ లా కూడా అతిధులకు అందించవచ్చు. గోబీ టకా టిన్ మీద ఉల్లిపాయ ముక్కలు,ఉడికించిన బఠానీ కూడా వేసి సర్వ్ చేయవచ్చు  

మరింత సమాచారం తెలుసుకోండి: